Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 7:31 pm Posted by : ramakrishna

ఎన్ సీ సీ లో బంగారు పతకం సాధించిన సాత్విక

బతుకమ్మ,ఎర్గట్ల : ఏర్గట్ల మండల గౌడ సామాజిక వర్గానికి మండల అధ్యక్షుడు, సుధనవేని శ్రీనివాస్ గౌడ్ కుమార్తె సాత్విక ఎన్ సిసిలో భాగంగా జాతీయస్థాయిలో బంగారుపతకం గెలుపొంది తన ప్రతిభను చాటింది. నిజామాబాద్ మహిళా కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువు కొంటూ సాత్విక ఎంతో పట్టుదలతో ఎన్ సిసి లో ఎంపికైనారు. కాకినాడలో అనంతపూర్ తమిళనాడులో ప్రత్యేక శిక్షణ పొంది ఢిల్లీకి సాత్విక పోవడం జరిగింది. అక్కడ స్వాత్విక ఎంతో నైపుణ్యంతో తన ప్రతిభను చాటి బంగారు పతకం కైవసం చేసుకోవడం పట్ల ఏర్గట్ల గ్రామ ప్రజలు స్వాత్విక కూ అభినందనలు తెలిపారు.