Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 October 2024, 12:30 pm Posted by : ramakrishna

మధ్యపాన నిషేదాన్ని ప్రభుత్వాలు అమలుచేసి బాపూజీకి బహుమతిగా ఇవ్వాలి

 

 – అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ

 నిజామాబాద్ సీటి, బతుకమ్మ:

సత్యం, అహింస వాదంతో భారతదేశనికి స్వాతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి సేవలు మరువలేనివని సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు..భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గోని గాంధీ చౌక్ లో ఉన్న మహాత్మా విగ్రహానికి బిజెపి శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్వరాజ్యం సిద్దించి ఏడు వసంతాలు పూర్తి అవుతున్న ఆ మహనీయుడు కలలు కన్న స్వరాజ్యం మనం సాధించలేకపోయాం అనేది వాస్తవం అన్నారు .యువత మారకద్రవ్యల మత్తులో చిందులేస్తుందని ఆనాడు గాంధీ అర్ధరాత్రి ఆడబిడ్డ  ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారని కానీ  నాడు పట్టపగలు ఆడబిడ్డలకు రక్షనే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు చిన్న పిల్లల దగ్గరినుండి పండు ముసలమ్మా వరకు నేటి సమాజంలో అఘాత్యాలు జరుగుతున్నాయన్నారు . తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపరీతంగా గల్లీకో మద్యం దుకాణం వెలిసాయన్నారు పల్లెల్లో మళ్ళీ గుడుంబా గుప్పుమంటుందన్నారు పూటకో మర్డర్, పూటకో మానభంఘం జరుగుతుందని ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు మర్డర్లు, ఆరు మానభంఘాలు అన్నట్లు ఉందని  మారకద్రవ్యలు విచ్చలవిడిగా సరఫరా జరుగుతున్నాయని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు న్యాలం రాజు, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు.