బీసీ కుల గణనపై ప్రభుత్వానివి కాకి లెక్కలు

కరీంనగర్, బతుకమ్మ: బీసీ కుల గణనపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ లో ఉన్న జ్యోతి బాపూలే విగ్రహానికి కవిత సోమవారం నివాళులర్పించి మాట్లాడారు. బీసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించిన కవిత, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మేమెంతుంటే మాకంత వాటా అంటూ నినాదమిచ్చిన రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారన్నారు.  ఉమ్మడి రాష్ర్టంలో 2011 జనాభా లెక్కల...