Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 9:43 pm Posted by : ramakrishna

బాపూజీ వచనాలయం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

👉 అవినీతి అక్రమాలపై విచారణ జరగాలి

👉టి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వినతి

 

నిజామాబాద్, బతుకమ్మ : దశాబ్దాల చరిత్ర కలిగిన బాపూజీ వచనాలయం ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్కడ ఇప్పటివరకు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపూజీ వచనాలయం పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ కోరారు. మంగళవారం జిల్లా పర్యటనలో
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి కి , పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ , నటరాజ్ గౌడ్ తదితరులు బాపూజీ వచనాల ఆస్తులను కాపాడాలని కోరారు. పాలకవర్గంలో కళ్ళు సారా కాంట్రాక్టులు చేసిన వారు దురుద్దేశంతో బాపూజీ వచనాలు స్థలాన్ని కాజయాలని కుట్రతో పాలకవర్గంలో చేరి 8 దశాబ్దాలుగా కూడా పెట్టినటువంటి పైసా పైసా కిరాయిలు జమ చేసి ఉంచినటువంటి 80 లక్షల రూపాయలు డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతో కాజయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. కొత్త భవనాల నిర్మాణం పేరుతో పుస్తక భాండాగారమైనటువంటి బాపూజీ వచనాలయాన్ని అవకతవకలకు పాల్పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని కాపాడాలని కోరారు. ఎనిమిది దశాబ్దాలుగా ఉన్నటువంటి లైబ్రరీని పుస్తక భాండాగారాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవకాశవాదులను ఆరాచకాలపై తక్షణమే విచారణ జరిపి నిధుల కైంకర్యంపై అవకతవకలకు పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు.