బతుకమ్మ, నవీపేట్ : మండలం లోని బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నాళేశ్వర్, నిజాంపూర్, బినోల, లింగాపూర్, జన్నపల్లి, మోకన్ పల్లి, నాడాపూర్, దర్మరం, ఆనంతగిరి, గ్రామాల్లో సోమవారం సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు వరి దాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు రైతులు తాము పండించిన దాన్యాన్ని ఆరబేటీ, తప్ప,తాలు లేకుండా తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు కు ఏ గ్రేడ్ కు 2320 రూపాయలు,కామన్ గ్రేడ్ కు 2300 రూపాయలను ఆందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 33 రకాల సన్నరకం వడ్లకు ఏలాంటి గింజ యొక్క పోడవు, ఇతర ప్రమాణాలు, షరతులు లేకుండా బోనస్ పరిగణలోకి తీసుకోవాలని, ఇప్పటికే కోనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం, వాతావరణ పరిస్థితులు ఆనుకులించకపోవడంతో అక్కడక్కడ రైతులు దళారులకు తక్కవ రేటు ఆమ్ముకోని నష్ట పోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట రమణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాం చందర్, సొసైటీ ఉపాధ్యక్షులు బాబర్, డైరేక్టర్లు విజయ్, ఆంజాగౌడ్, గంగాధర్, బాలు చందర్, రమణారావు, నవిన్, గంగాదర్, రైతులు ప్రవిణ్, శ్యామ్, రమేష్, నవిన్, సాయిలు,బాల్ రాజు,సంజివ్ రావు,పోశేట్టి,వ్యవసాయ ఆదికారి వసంత్, సంపూర్ణ,సంఘ సిబ్బంది,మరియు గ్రామస్థులు పాల్గొన్నారు