సామాజిక సేవకులకు ప్రభుత్వం అండ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని, సామాజిక సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సందర్శించారు. 13 ఏండ్లుగా నిర్విరామంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం...