నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి

ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన   నిజామాబాద్, బతుకమ్మ :  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాకు చెందిన  వివిధ రంగాలలో  ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్టి జరిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, కలెక్టరేట్ కు విచ్చేసిన గవర్నర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన శాసన సభ్యులు...