Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 3:02 pm Posted by : ramakrishna

బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన గవర్నర్

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 50శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతిచ్చారు  దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.