- పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్
భీమ్ గల్, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్ ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని ఆదివారం మండలంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్యు విద్యార్థి నాయకులతో కలిసి భీమ్ గల్ లో పలు స్కూలను సందర్శించారు.ఈ సందర్భంగా ప్రజా పంధా భీమగల్ మండల కార్యదర్శి రాజేశ్వర్, పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ లు ముఖ్య వ్యక్తలుగా హజరై. వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయని, వారి స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటీలమవుతా ఉందన్నారు.అందుకే ప్రభుత్వ కళాశాల ,పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకుందని,అందులో బాగంగానే ఆర్మూర్ నుండి మొదలైనటువంటి ఈ కార్యక్రమం నేడు భీమ్ గల్ చేరిందాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్ ,ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు నిఖిల్ ,ఏరియా నాయకులు రుచిత, వివేక్, వినయ్ వెంకట్, బాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.