మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఫోన్లో మాట్లాడారు. రైలులో యువతి పై అత్యాచారయత్నం ఘటన పై ఆందోళన వ్యక్తం చేశారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ...