అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
బతుకమ్మ, మాచారెడ్డి: అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనం కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాచారెడ్డి మండలం అక్కాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాలు అమలు కొరకు గ్రామసభలో జాబితాలను...