Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 5:15 pm Posted by : ramakrishna

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజా పాలనలో పేదలకు అర్హులకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలలో అర్హులైన వారు లిస్టులో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పలాలు అర్హులకు అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఆర్ ఐ రంజిత్ కుమార్, వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అరుణ్, ఏఈఓ రంజిత్, ఏ ఈ స్వరాజ్, కారోబార్ సాయన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Government welfare schemes for all eligible