Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 9:03 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, ముఖ్య సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సైదులు రెడ్డి సమక్షంలో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, ముఖ్య సలహాదారులుగా కృపాల్ సింగ్ సోడి ను సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రాతినిత్యం చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నూతన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ డి ఏ లు విడుదల చేయాలని , పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని, టెట్ మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్ ఆర్ ఎస్ తొలగించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరి శంకర్, స్వామి, బాలరాజు, యాదయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Government Teachers' Association District Executive Committee Election