ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ నిజామాబాద్ లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు చల్లా ముద్దుకృష్ణ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 లో పాల్గొన్నారు. ఈయన గురుకులం : ఔత్సాహిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల వర్క్ షాప్, సైన్స్ సఫారి : సైన్స్ త్రూ గేమ్స్ అండ్ టాయ్స్, యంగ్ సైంటిస్ట్ కాంక్లేవ్ అనే మూడు విభాగాలలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 తేదీ, 2024 వరకు  అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి లోని ఐఐటి క్యాంపస్‌లో నిర్వహించారు....