Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 6:03 pm Posted by : ramakrishna

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ నిజామాబాద్ లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు చల్లా ముద్దుకృష్ణ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 లో పాల్గొన్నారు. ఈయన గురుకులం : ఔత్సాహిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల వర్క్ షాప్, సైన్స్ సఫారి : సైన్స్ త్రూ గేమ్స్ అండ్ టాయ్స్, యంగ్ సైంటిస్ట్ కాంక్లేవ్ అనే మూడు విభాగాలలో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 తేదీ, 2024 వరకు  అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి లోని ఐఐటి క్యాంపస్‌లో నిర్వహించారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐ ఐ ఎస్ ఎఫ్) అనేది విజ్ఞాన భారతితో కలిసి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రోత్సాహం , ఇది దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తల నేతృత్వంలోని స్వదేశీ స్ఫూర్తితో  నడిచే సైన్స్ విభాగంలో సైన్స్ తరగతి గదుల్లో, అంతకు మించి గణనీయమైన ప్రభావాన్ని చూపగల సమర్థవంతమైన, స్పూర్తిదాయకమైన ఉపాధ్యాయులుగా మారడానికి సమగ్ర టూల్‌కిట్‌ను అందించే లక్ష్యంతో గురుకుల కింది దృష్టి కేంద్రీకరించిన కార్యకలాపాలను కలిగి ఉంటుంది, తద్వారా కొత్త తరం సైన్స్ ఔత్సాహికులను సృష్టిస్తుంది, ప్రగతిశీల, సాంకేతికత దృష్టికి అనుగుణంగా ఉంటుందన్నారు. ఇందులో పెడగోగికల్ టెక్నిక్స్  తరగతి గది నిర్వహణ వృత్తిపరమైన అభివృద్ధి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, మూల్యాంకనం ఉపాధ్యాయుల నెట్‌వర్క్ పై అవగాహన కల్పిస్తూ సలహాలు స్వీకరిస్తారు. సైన్స్ సఫారి లో విద్యార్థులు బొమ్మలు ఆటల ద్వారా సైన్స్ నియమాలు సూత్రాలు సిద్ధాంతాలు ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాలు వివరించారు. యంగ్ సైంటిస్ట్ విభాగం లో ఆయన చేసిన రీసెర్చ్ పేపర్ నీ ఈ విభాగం లో వివరించారు. ఈ విధంగా ఒక జాతీయ కార్యక్రమం లో 3 విభాగాల్లో పాల్గొనడం సంతోషం గా ఉందని ముద్దుకృష్ణ తెలిపారు.

Government teacher who participated in India International Science Festival