Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2025, 1:22 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో ప్రభుత్వ టీచర్  ఇంటిలోచోరీ

 

రుద్రూర్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో  గవర్నమెంట్ టీచర్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టీచర్ తన కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటికి తాళం లేకపోవడంతో గమనించి లోపలికి వెళ్లి చూడగా, వస్తువులన్నీ చిందరవందగా పాడేసి ఉండడంతో  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అదివారం రాత్రి చోరి జరిగి ఉంటుందని అనుమానాల వ్యక్తం అవుతున్నాయి. క్లూస్ టీం ద్వారా  పూర్తి వివరాలు  సేకరిస్తామని  ఎస్సై సాయన్న వెల్లడించారు.