Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 7:57 pm Posted by : ramakrishna

సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ తోడ్పాటు

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

పేదలకు సొంతింటి కల నేరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందని ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు చిట్టడి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి అన్నారు. గురువారం భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో మైలారం భూదవ్వ బలరాం అనే లబ్ధిదారుని ఇంటిని వారు ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇంటిని నాణ్యతతో నిర్మించుకొని ప్రభుత్వం అందించే ఐదు లక్షల సాయాన్ని అందుకోవాలని వారు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సర్పంచ్ సారే అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్న గంగయ్య, గోపాలస్వామి, అఖిల్, భాను, అరవింద్, అమృత రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.