Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 5:14 pm Posted by : ramakrishna

ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

 

. . . బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్

 

రుద్రూర్ బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూరు, కోటగిరి, పొతంగల్ మండలాల్లో వరి కోతలు మొదలైన సందర్భంగా బీజేపీ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతస్థాయి పర్యటన చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు విధానాన్ని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాన్ని (గవర్నమెంట్ కాంటాను) ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల వద్ద తీవ్రంగా నష్టపోతున్నారనీ విచారం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఒక్క క్వింటాల్ కు 300 నుంచి 400 రూపాయల వరకు నష్టపోతున్నారని, రైతుల గోషను గమనించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నియోజకవర్గ సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, వడ్ల సాయినాథ్, గుంజరి జగదీష్, కమ్మరి శివశంకర్, మామిడి శ్రీనివాస్, సాయిలు, సీనియర్ నాయకులు జీలకర్ర విజయ్, గణేష్ పటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు.