ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
. . . పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలో చేర్పించాలి . . . ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి...