ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖానా ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్, బతుకమ్మ : 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ లోని యూపిఎస్ పాఠశాలను, బస్తీ దావఖానను మంగళవారం అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు  యూపీఎస్ పాఠశాలలో ఆరు మంది ఉపాధ్యాయులు ఉన్న, మౌలిక సౌకర్యాలు అన్ని ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య 40 మాత్రమే ఉందని సరైన విద్య అందించకపోవడమే కారణమని అన్నారు. విద్యా సంవత్సరం మొదలై ఏడు నెలలు పూర్తి కావొస్తున్న మిర్చి కాంపౌండ్ లోని యూపీఎస్, ఉర్దూ పాఠశాలలో  విద్యార్థుల విద్యా...