Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 5:06 pm Posted by : ramakrishna

అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  కార్యకర్తలకు అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో జాగృతి సంఘంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు అయినటువంటి మహాలక్ష్మి పథకం రానివారు, గృహజ్యోతి పథకం రానివారు, రేషన్ కార్డులో పేర్లు రానివారు. ఉంటే  తమ దృష్టికి తీసుకురావాలని నూతనంగా అప్లికేషన్ చేసుకోవాలని ప్రభుత్వ పథకాల అర్హులందరికీ అంది విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రజా పాలన నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో  నాయకులు ఆనంద్, పాలెం గ్రామ అధ్యక్షులు బ్రహ్మనాయుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.