అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
బతుకమ్మ,మోర్తాడ్: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని అర్హులై ఉండి జాబితాలో పేరు రాకపోతే నూతనంగా అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాటిని వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేస్తామని డిప్యూటీ తాసిల్ ల్దార్ సుజాత అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ ఓ శ్రీధర్, ఏఈఓ లకుపతి, పంచాయతీ సెక్రటరీ లక్ష్మి దుర్గ, మండల అధ్యక్షులు రాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.