ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు చేయాలి
లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని ఆదేశం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బ్లాక్ ప్లాంటేషన్లను పరిశీలించిన కలెక్టర్ భీమ్ గల్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం భీమ్‌గల్ మున్సిపాలిటీని ఆయన సందర్శించారు.పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఒక్కో వార్డు...