Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 7:24 pm Posted by : ramakrishna

దుర్గామాత శోభాయాత్రలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇటీవల జరిగిన దేవీ నవరాత్రుల నిమజ్జన కార్యక్రమం లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వీహెచ్పి సార్వజన కమిటీ నాయకుడు ఇప్ప కాయల హరిదాస్ విమర్శించారు. ఈ ఘటనపై  శుభ యాత్ర  ఏర్పాట్ల గురించి విశ్వహిందూ పరిషత్ ఇందూరు శాఖ విచారణ వ్యక్తం చేస్తుందని అన్నారు.  మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్రలో ఒక క్రేన్, లైటింగ్, వ్యవస్థ ను అధికార యంత్రాంగం ఏర్పాటు చేయకపోవడం  దారుణమన్నారు. అలాగే శోభయాత్ర జరిగే ప్రాంతంలో  సుచి శుభ్రత లేకపోవడం, కనీసము ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక కానిస్టేబుల్ ను కూడా ఏర్పాటు చేయకపోవడం దౌర్భాగ్యమైన చర్య అని అన్నారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం  పాలన చూస్తుంటే రజాకర్ పరిపాలనలో ఉన్నామా.. అన్న సందేహాన్ని ప్రతి ఒక్క హిందువు  ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అప్పట్లో రజాకార్ పాలనలో హిందూ దేవతలపై, దేవాలయాలపై, స్త్రీలపై దాడులు జరిగేవని, ప్రస్తుతం అదేవిధంగా మన దేవాలయాలకు, దేవాలయంలో ఉన్న విగ్రహాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల సికింద్రాబాద్ ఉన్న దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం మర్చిపోకముందే, నిన్న అదే ప్రాంతం లోని కుమ్మరిగూడ ప్రాంతంలో ముత్యాలమ్మ  విగ్రహాన్ని ముస్లిం గుండాలు మతోన్మాదులు ధ్వంసం చేయడం జరిగిందన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు  ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అమ్మవారి విగ్రహాలపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యక్షులు అంబెం సాయిలు, కోశాధికారి లింగం, సహకార్యదర్శులు యార్లగడ్డ శ్రీనివాసరావు, శ్రీకాంత్, విశ్వ హిందు పరిషత్ విభాగ్ ప్రముక్ తమ్మల కృష్ణ,  విశ్వ హిందు పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, సహ కార్యదర్శి దాత్రిక రమేష్,  నగర అధ్యక్షులు కోడిమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, బాసోల్ల నికేష్, ఎడ్ల రాము తదితరులు పాల్గొన్నారు.