Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 9:43 pm Posted by : ramakrishna

ప్రభుత్వ భూమిని కాపాడండి

  • భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పండి
  • కమలాపూర్ మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా!
  •  గుండేడు పంగిడిపెల్లి గ్రామాలలో  అక్రమ మైనింగ్ దందా!
  • 450 ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేసేలా చూడండి.
  • హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు ఫిర్యాదు చేసిన కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్

 

కమలాపూర్, బతుకమ్మ:  కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని.. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల వ్యాప్తంగా అనేక అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అంబాల మర్రిపల్లిగూడెం శనిగరం వాగులు పారే ప్రతి గ్రామాల నుండి ఇసుక యదేచ్చగా దళారులు అక్రమ ఇసుక రవాణా చేపడుతున్నారని అక్రమ ఇసుక రవాణా చేసే ఎంతటి వ్యక్తులనైనా కఠినంగా శిక్షించాలని కోరారు. పంగిడి పెళ్లి గుండెడు గ్రామాలలో అక్రమ క్వారీ ద్వారా మైనింగ్ మాఫియా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తూ చుట్టుపక్కల పొలాల రైతులను  తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు ఎంత ప్రతిఘటించిన అక్రమ మైనింగ్ ను  కొనసాగిస్తున్నారని అన్నారు. కమలాపూర్ లో మండల వ్యాప్తంగా మరీ ముఖ్యంగా కమలాపూర్ మండల కేంద్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి అక్రమ రియల్ ఎస్టేట్ ద్వారా నిర్మాణాలు చేస్తూ భూములను ఇళ్లను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. అనతి కాలంలోనే  రియాల్టర్ వ్యాపారుగా కొనసాగుతూ ఉన్నారని ఇలా ఏ ఏ వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కమలాపూర్ మండలానికి మంజూరైన 450 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు.