- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ , బతుకమ్మ : మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండలం ఘనపూర్ గ్రామంలో ఎఫ్డిఎస్ మరియు ఎన్డీఎఫ్ నిధులు 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనం ప్రారంభోత్సవంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మత్స్యశాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.