Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 5:33 pm Posted by : ramakrishna

దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుంది

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

నిజామాబాద్, బతుకమ్మ : దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజమాబాద్ ఖిల్లా జైలులో దాశరథి కృష్ణమాచార్యులు శిక్ష  అనుభవించిన బ్యారక్ ను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  ‘‘దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుంది. దాశరథి తెలంగాణ సంపద, శత జయంతి  ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి. ఉత్సవాల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే జాగృతి తరపున జూలై  21, 22 తేదీల్లో శత జయంతి ఉత్సవాలు. దాశరథి చరిత్ర కాపాడుకోవాలి. శత జయంతి ఉత్సవాల పై ప్రభుత్వ తీరు దున్న పోతు మీద వర్షం పడ్డట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సోయి మరచింది. ధాన్యం కొనుగోళ్ళు ఇప్పటికీ పూర్తి చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు.

Government ignores Dasarathi Krishnamacharya's centenary celebrations