- రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ , బాన్సువాడ : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ లో సోమవారం రూ. 43 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం రూ. ఏడు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, పెరిక శ్రీనివాస్, కంది మల్లేశ్, శ్యామల, వైద్యాధికారి గిరీష్ పాల్గొన్నారు…