Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 7:26 pm Posted by : ramakrishna

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

 

బీజేపీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులకు సన్మానం

 బాన్సువాడ, బతుకమ్మ :

సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందాలని బిజేపి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ యెండల లక్ష్మి నారాయణ పిలుపు నిచ్చారు. ఇటివల బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో గెలిచిన 7 గురు సర్పంచులు, ఆరుగురు ఉప సర్పంచ్ లు,29 మంది వార్డు మెంబర్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు లు, జిల్లా ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లి వారిని చైతన్య పరచాలని బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూశారని, వారి మోసపూరిత హామీలు ప్రజలకు మోసపోలేదని అన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లి పార్టీ మరింత బలోపేతం చేయాలని వారు కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సాయిలు, కార్యదర్శి శంకర్ గౌడ్, బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.