ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. రమేష్ ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. సత్యానంద్, ఓ. రమేష్ మాట్లాడుతూ 1974 ఆగస్టు 10 న ఆవిర్భవించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది అన్నారు....