మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, వాణిజ్య మంత్రిగా, ఆర్థిక సలహాదారుగా పనిచేశారని తెలిపారు. మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన నాయకులు మన్మోహన్ సింగ్ అని అన్నారు. రెండుసార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని తెలిపారు. ఈ...