Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 4:32 pm Posted by : ramakrishna

మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, బతుకమ్మ  : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా,  వాణిజ్య మంత్రిగా, ఆర్థిక సలహాదారుగా పనిచేశారని తెలిపారు. మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన నాయకులు మన్మోహన్ సింగ్ అని అన్నారు. రెండుసార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, కామారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Government Advisor Shabbir Ali paid tribute to the former Prime Minister