ఫ్యూజన్ ఫార్మా కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ పాలకవర్గం తీర్మానం

భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూజన్ ఫార్మా కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ నెల 7న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన కారణంగా పాలకవర్గం తీర్మానం చేశామని సర్పంచ్ బల్యాల రేఖ అన్నారు. ఇప్పటికే ఎమ్మెస్ఎన్ కంపెనీ వల్ల గాలి నీరు కలుషితమవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అన్నారు. ఫ్యూజన్ ఫార్మా కంపెనీకి అనుమతించవద్దని ఈ ఫార్మా కంపెనీ వల్ల వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులు...