Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 1:49 pm Posted by : ramakrishna

పరిపాలన అంటే కొత్త అవకాశాలు సృష్టించడం

పేదల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి

సివిల్ సర్వీస్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ

డిల్లీ, బతుకమ్మ : ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదని, కొత్త అవకాశాలు సృష్టించడమని ప్రధాని మోదీ అన్నారు.  సోమవారం  సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రజల వెయ్యేళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయన్నారు. దేశ యువత, రైతులు, మహిళల ఆకాంక్షలు నెరవేర్చుతూ ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ఈనిర్ణయాలు ఉపయోగపడతాయన్నారు. ’పేదలసమస్యలను ఓపిగ్గా వినండి. వారితో సున్నితంగా వ్యవహరించడండి. వారిని గౌరవించండి. పేదల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి‘ అని సివిల్ సర్వెంట్లకు మోదీ విజ్ఞప్తి చేశారు.

Governance means creating new opportunities