Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2025, 9:56 pm Posted by : ramakrishna

కోడ్ వచ్చింది ..   ముసుగొచ్చింది..

  • అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్

నిజామాబాద్ , బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నామినేషన్ల పర్వం స్వీకరణ ప్రారంభం కాగానే ఎన్నికల కోడ్ ప్రకారం జాతీయ పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 27న ఎన్నికలు, మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఖరారు కాగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. టీచర్ ఎమ్మెల్సీల నామినేషన్ల ముందే అభ్యర్థులు ఖరారు అయ్యారు. స్వతంత్రులు కూడా బాగానే పోటీ పడుతుండడం విశేషం.

Got the code.. Covered..