గొర్రెపాటి మాధవరరావు సేవలు మరువలేనివి

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి క్మాధవరావు నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌరసమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం  న్యాయవాద సమాజానికి తీరని లోటని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ సమావేశపు హల్ లో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నాలభైరెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్ చేశారని ఆయన కొనియాడారు.యువ న్యాయవాదులు మాధవరావు అధ్యయనశీలిని అలవర్చుకోవాలి జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని...