బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ బాధ్యతల స్వీకరణ
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గోపు గంగాధర్ గతంలో భీంగల్ మున్సిపాలిటీలో కమిషనర్‌గా విధులు నిర్వహించగా, బదిలీపై బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పట్టణ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు...