Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 9:21 pm Posted by : ramakrishna

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ బాధ్యతల స్వీకరణ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గోపు గంగాధర్ గతంలో భీంగల్ మున్సిపాలిటీలో కమిషనర్‌గా విధులు నిర్వహించగా, బదిలీపై బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పట్టణ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.