భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ నూతన కమీషనర్ గా గోపు గంగాధర్ బదిలీ పై వచ్చారు. ఇక్కడ ఇది వరకు పని చేసిన వై. రామకృష్ణ వరంగల్ కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు.ఇది వరకు భీమ్ గల్ మున్సిపల్ లో పని చేసి వెళ్లి గోపు గంగాధర్ ఇక్కడికే రావడం విశేషం. ఈ సందర్బంగా కమిషనర్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా వచ్చిన పాత కమీషనర్ ను పలువురు పట్టణ ప్రముఖులు కలిసి సన్మానించి, కాంగ్రడ్స్ తెలియజేశారు.ఉద్యోగ బాధ్యతలు తీసుకొన్న కమిషనర్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు, భీమ్ గల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ లను కలిశారు.