Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 7:08 pm Posted by : ramakrishna

గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన బుర్ర భువనకు గోప సత్కారం

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ కూతురు బుర్ర భువన గ్రూప్ 2 లో ప్రతిభ  చాటి సిద్దిపేట కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ గా నియమితులైనందుకుగాను గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప ) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు.  చిన్న వయసులో మొదటి ప్రయత్నంలోనే మంచి ఉద్యోగం సాధించడం ప్రశంసించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోప జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్, కోశాధికారి బాలా గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, దూలం సంపత్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి శ్రీధర్ గౌడ్, మహేష్ గౌడ్, పృథ్వి ధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.