బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం తాసిల్ ల్దార్ గా సేవలందించి బదిలీపై ఆర్మూర్ కు వెళ్తున్న ఎమ్మార్వో సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు మరువలేనివని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని వారు కోరారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే ముప్కాల్ మండలం నుండి మోర్తాడ్ మండలానికి నూతన తాసిల్ ల్దార్ గా బదిలీపై వచ్చిన సీ.హేచ్ కృష్ణకు స్వాగతం పలికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గిర్మాజీ గోపి, మాజీ ఎంపీపీ గిర్మాజీ గంగాధర్, డిసిసి డైరెక్టర్ మోతుకు భూమన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
