జిజెసీ ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అకౌంట్స్ ఆఫీస్ అసిస్టెంట్, ఫిషరీష్, ఒకేషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు మంచి అపార్చునిటీస్ లభిస్తాయని, ఈ ప్రోగ్రాం ద్వారా స్వీయ అనుభవం కలుగుతుందని భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(జి. జె. సీ ) ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ జిజెసీ లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (ఓ. జె. టి)ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతు ఈ ప్రోగ్రాంలో భాగంగా కళాశాలలో చదువుతున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో చదువుతున్న విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్తారని అన్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణ విధానం, అందులో ఉండే సదాకా భాధకాలు, లేటెస్ట్ టెక్నికల్స్ వినియోగం తదితర అంశాలను విద్యార్థులు నేరుగా పర్యటన లో పరిశీలిస్తరన్నారు. ఈ ట్రైనింగ్ ఈ క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా విద్యార్థులు చాలా నేర్చుకోంటారని అన్నారు. ఈ ప్రోగ్రాం నేటి నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో ఆఫీస్ అకౌంట్స్, ఆఫీస్ అసిస్టెంట్, ఫిషరీష్ విద్యార్థులు వారి విభాగాలకు సంబంధించిన ప్రదేశాలు, ఆఫీస్ లల్లో పర్యటన చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం లో లెక్చరర్లు రామచంద్రం, శ్రీనివాస్, క్రాంతి, శోభారాణి, శ్రీకాంత్ లు, ఏ అండ్ టీ, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, ఫిషరీష్, ఒకషనల్ విద్యార్థులు పాల్గొన్నారు.