తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

 వెబ్ న్యూస్, బతుకమ్మ :   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  చెప్పింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు 2.5 శాతం డీఏను ప్రకటించారు.  ఈప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుంది. మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో అద్దె ప్రాతిపదికన 150 బస్సులు.., తరువాత దశలో ఆర్టీసీలోకి 450 బస్సులు రానున్నాయి.