వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల కొరతను అధిగమించేందుకు కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనుంది. ప్రభుత్వం రూ.30 లక్షల సహాయం అందిస్తే, సంఘాలు రూ.6 లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేయొచ్చు. దీంతో మహిళలకు నెలవారీ స్థిర ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ తగ్గే అవకాశముంది. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిన విషయం తెలిసిందే.