కరెంటోళ్ల మంచి మనసు

దాతృత్వాన్ని చాటిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తమ మంచి మనసును చాటుకుంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల దాస్ నగర్ పాఠశాలకు 20 ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము అండగా నిలబడతామని అన్నారు. గదులలో ఫ్యాన్స్ సౌకర్యం లేకపోవడంతో...