Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 6:42 pm Posted by : ramakrishna

కరెంటోళ్ల మంచి మనసు

  • దాతృత్వాన్ని చాటిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తమ మంచి మనసును చాటుకుంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల దాస్ నగర్ పాఠశాలకు 20 ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము అండగా నిలబడతామని అన్నారు. గదులలో ఫ్యాన్స్ సౌకర్యం లేకపోవడంతో ఈ వేసవి వేడికి తట్టుకోడానికి 20 ఫ్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్, 1104 యూనియన్ కంపెనీ ప్రెసిడెంట్ రఘునందన్, జిల్లా కార్యదర్శి పి గంగాధర్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, జేఏసీ నాయకులు బాలేష్ కుమార్, సురేష్ కుమార్, గంగారం నాయక్ ,నాంపల్లి ,మల్లేష్, మన్మోహన్, చంద్రశేఖర్ ,రాజేందర్, వేణుగోపాల్, నవీన్ రెడ్డి ,కళాశాల ప్రిన్సిపల్ స్వప్న, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Good man of the currents