Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 7:14 pm Posted by : ramakrishna

మహాలక్ష్మి పథకానికి మంగళం

  • తులం బంగారం ఊసేలేదు
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని,తులం బంగారం హామీకీ తూట్లు పొడిచారాని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఎద్దేవ చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే ధన్ పాల్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ద్వారా 64 మందికి 22,28,000 రూపాల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15, 20 శాతం మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20 వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు.బాధితులు అప్లై చేసుకున్న మొత్తంలో 50 శాతం ప్రభుత్వం చెల్లించేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలల్లో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.