Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 12:26 pm Posted by : ramakrishna

డి ఆర్ యూసిసి సభ్యుడిగా గోండాల సురేష్ బాబు

 

 నిజామాబాద్, బతుకమ్మ:

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని డివిజన్ ల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ( డిఆర్ యూసిసీ) సభ్యుడిగా నిజామాబాద్ నగరానికి చెందిన గోండాల సురేష్ బాబు నియమితులు అయ్యారు. నగరంలోని గాజుల్ పేట్ కు చెందిన సురేష్ బాబు బిజేపిలో సినియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో 11 వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి డిఆర్ యూసిసి సభ్యుడిగా గోండాల సురేష్ బాబు పేరును ప్రతిపాదించగా దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.దక్షిణ మధ్య రైల్వే  డి ఆర్ యూసిసి సభ్యుడిగా నియామకం పొందిన గోండాల సురేష్ బాబు తన నియామకానికి సహకరించిన, ఈ అవకాశం కల్పించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రైల్వే అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని  అన్నారు.

Gondala Suresh Babu as a DRUCC member