Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 2:57 pm Posted by : ramakrishna

లబ్ధిదారులకు సువర్ణావకాశం

మోర్తాడు, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు  నిర్మించుకోవడానికి  ఆర్థికంగా చేయూతన అందించడానికి ఐకెపి ద్వారా లబ్ధిదారులకు రూ. 50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు రుణాలు అందిస్తుందని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా సీసీల కార్యదర్శి తడకల శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో బుధవారం ఐకెపి ద్వారా రుణాలు తీసుకొని ఇండ్లు నిర్మించుకుంటున్న  నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే గ్రామంలో అలాగే వృద్ధుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అనేకుల ఇండ్లను సర్వే చేయడం  జరిగిందని ఆయన తెలియజేశారు.కార్యక్రమంలో వి వో లు వనిత, వరలక్ష్మి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.