Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2024, 2:43 pm Posted by : ramakrishna

ఆయిల్ ఫాం సాగుతో బంగారు భవిష్యత్తు

  • రైతు ఆదే ప్రవీణ్

బతుకమ్మ, నిజామాబాద్ : ఆయిల్ ఫాం సాగుతో బంగారు భవిష్యత్తు ఉంటుంటుందని రైతు ఆదే ప్రవీణ్ అన్నారు.
మెగా ఆయిల్ ఫామ్ ఫ్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా సిరుపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలను రైతు ఆదే ప్రవీణ్ కుమార్ భూమిలో బుధవారం నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కొరత, ఆర్థికభారం, పెట్టుబడులు పెరిగి ఇక్కట్లు పడుతున్న రైతులకు ప్రత్యమ్యాయంగా ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగపడుతుందన్నారు. తన నాలుగున్నారా ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించానని, ఇప్పుడున్న పరిస్థితులల్లో ఆయిల్ ఫామ్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సహాకలు అందిస్తున్నదన్నారు. ఓక్క ఆయిల్ ఫామ్ మొక్క ₹193/- రూపాయలు వుంటే అందులో సబ్సిడీ కింద ₹173/- రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనీ కేవలం రైతు ఓక్క మొక్కకు ₹20/- రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందనీ తెలిపారు. ఆయిల్ ఫామ్ లో అంతర పంటల నిర్వహణకు ఎకరానికి ₹4200/- రూపాయాల చొప్పున నాలుగు సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఇంకా డ్రిఫ్ సబ్సిడీ కింద ఎస్టీ, ఎస్సీ రైతులకు 100% సబ్సిడీకీ అర్హులనీ ( ఐదు ఎకరాల వరకు ), చిన్న, సన్నకారు రైతులయితే 90% సబ్సిడీకీ అర్హులనీ తెలిపారు. మిగతా రైతులు 80% ( ఐదు ఎకరాల వరకు ) అర్హులనీ ఆయిల్ ఫామ్ చట్టం 1993 ద్వారా రైతులకు పరిరక్షణ కల్పిస్తుందనీ తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాలనుండి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరం పంట రావడం ద్వారా ఆదాయం పొందవచ్చు అనీ అన్నారు. తెగుళ్లు, చీడ పీడలు ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువనీ, ఆయిల్ ఫామ్ సాగులో ఖర్చులు కూడా తక్కువనీ, ఇంకా కూలీలా అవసరం కూడా చాలా తక్కువగా వుంటుందని అన్నారు. ఓక వ్యక్తి పది ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ తోటను సులువుగా పర్యవేక్షించవచ్చుననీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియునిక్ కంపెనీ ఇంచార్జి గణేష్, ఆదే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Golden future with oil farm cultivation